సాయి ధరమ్ తేజ్ కు ఆపరేషన్ విజయవంతం..ఊపిరి పీల్చుకున్న అభిమానులు
- September 12, 2021
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయి ధరమ్ తేజ్ కాలర్ బోన్ ఆపరేషన్ సక్సెస్ అయింది. మరో 24 గంటలు వెంటిలేటర్ పైనే సాయి తేజ్‌కి ట్రీట్మెంట్ అందించనున్నారు. నిరంతరం డాక్టర్స్ పర్యవేక్షణలో ఆయన ఉంటారని , ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
ప్రమాద సమయంలో సాయి ధరమ్‌కి కాలర్ బోన్ ఫ్రాక్చర్, కన్ను, ఛాతి భాగంలో గాయాలయ్యాయి. శరీరం లోపల మాత్రం ఎలాంటి రక్తస్రావం లేదని అపోలో వైద్యులు తెలిపారు. ఇక హీరో రామ్‌చరణ్, నిర్మాత అల్లు అరవింద్ అపోలో ఆస్పత్రికి చేరుకుని తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుంటున్నారు.

తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్‌తో అభిమానులలో కాస్త ఆందోళన తగ్గింది. సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. కాగా, సాయి ధరమ్‌కి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రాగా,ఆయన నొప్పి అని అనడం కనిపించింది. త్వరలోనే ఆయన కోలుకుంటారని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







