ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

- September 12, 2021 , by Maagulf
ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

న్యూ ఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా 24 క్యారెట్ల 5 కేజీల బంగారం పెట్టుకున్నారు. దుబాయ్, మస్కట్ ప్రయాణీకుల వద్ద 5 కేజీలకు పైగా బంగారం సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు. అయితే కస్టమ్స్ అధికారులే ఆశ్చర్య పోయే విధంగా బంగారంను వెరైటీ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. కేజీ బంగారాన్ని నోటిలో వున్న పళ్ళకు అతికించి దర్జాగా బయట చెక్కేసే ప్రయత్నం చేసారు. కస్టమ్స్ అధికారుల తనిఖీ లల్లో అక్రమ బంగారం గుట్టు బయటపడింది. మరో కేసు లో బంగారాన్ని కరిగించి పేస్టుగా మార్చి.. ఆ బంగారు పేస్టును జీన్స్ ప్యాంటు నడుము బాగంతో పాటు టీ షర్టు మెడ బాగంలో దాచారు కేటుగాళ్లు. ఈ బంగారం స్మగ్లింగ్ చేస్తూ… ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల చేతికి అడ్డంగా బుక్ అయ్యారు 6 మంది ప్రయాణీకులు. ఒకే రోజు 5 కేజీలకు పైగా బంగారం తో పాటు ఏడు మందిని అరెస్టు చేసారు కస్టమ్స్ అధికారులు. ఆ 5 మంది దుబాయ్ ప్రయాణీకుల తో పాటు విమానాశ్రయం బయట బంగారాన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మరో ఇద్దరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com