రాజభోగాలు అనుభవిస్తున్న తాలిబన్లు
- September 13, 2021
కాబూల్: తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నాక కాబూల్‌లోని ప్రెసిడెంట్ భవనంలో తిష్ట వేసిన సంగతి తెలిసిందే. ప్రెసిడెండ్ భవనంలో రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఖరీదైన తివాచీలపై కూర్చోని ఇష్టం వచ్చినవి వండించుకొని తింటున్నారు. దీనికి సంబందించిన దృశ్యాలు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇదిలా ఉంటే, ప్రెసిడెంట్ భవనంతో పాటుగా ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తోమ్ ఇంటిని కూడా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దోస్తోమ్ తాలిబన్లకు బద్ధశతృవు. పారాట్రాపర్గా, కమాండర్‌గా, దేశానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2001లో దాదాపు 2వేల మందికి పైగా తాలిబన్లను చంపేసిన వ్యక్తిగా దోస్తోమ్‌కు పేరున్నది. తాలిబన్ ముఠాలను కంటైనర్లలో కుక్కి ఎడారిలో వదిలేశారని, ఎండకు ఊపిరాడక తాలిబన్లు మరణించారని చెబుతుంటారు. తాలిబన్లు కాబూల్‌లోకి వచ్చే ముందే దోస్తోమ్ అక్కడి నుంచి కజికిస్తాన్‌కు పారిపోయారు. కాబూల్‌లోని ఇంద్రభవనాన్ని తలపించే ఇంటిని ఇప్పుడు తాలిబన్లు సొంతం చేసుకున్నారు. తాలిబన్ కమాండరైన కారీ సలాహుద్దీన్ ఆ భవనంలో తన అనుచరులతో కలిసి ఉంటున్నారు. కొండల్లో, లోయల్లో నివసించిన తాలిబన్లు ఇంద్రభవనాన్ని తలపించే ఆ ఇంట్లో నివశిస్తున్నారు. దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







