ఢిల్లీలో ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్ !

- September 14, 2021 , by Maagulf
ఢిల్లీలో ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్ !

న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ లో ఆరుగురు తీవ్రవాదులు అరెస్టు అయ్యారు. ఆ ఆరుగురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్ఠ్‌ చేశారు. ఒకే సారి మన దేశం లోని పలు రాష్ట్రాల లో ఢిల్లీ పోలీసులు సోదాలు మరియు తనిఖీలు ముమ్మురంగా చేశారు. ఉత్తర్ ప్రదేశ్ , మహారాష్ట్ర, ప్రయాగ్ రాజ్, ఢిల్లీ లో అనుమానితు లైన ఆరుగురు ఉగ్ర వాదులను అరెస్టు ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇక అరెస్టు అయిన ఆరుగురు అనుమానిత ఉగ్ర వాదులలో ఇద్దరు పాకిస్థాన్ లో శిక్షణ పొందినట్లు సమాచారం అందుతోంది. అంతే గాకుండా, తనిఖీల సందర్భం గా పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ “స్పెషల్ సెల్ ” పోలీసులు. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ “ స్పెషల్ సెల్ ” డి.సి.పి ప్రమోద్ కుష్వా వెల్లడించారు. పక్క గా వచ్చిన సమాచారం మేరకే ఆ ఉగ్ర వాదులను పట్టుకున్నామని స్పష్టం చేశారు. వారి నుంచి… మిగతా ఉగ్రవాదుల గురించి ఆరా తీస్తామని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com