ఇండియా ఏవియేషన్ సదస్సు, ప్రదర్శనను రాష్ట్రపతి ప్రారంభించారు..
- March 16, 2016
ఐదో అంతర్జాతీయ వైమానిక సదస్సు హైదరాబాద్‌లో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. బేగంపేట విమానాశ్రయంలో ఇండియా ఏవియేషన్ పేరిట ఏర్పాటుచేసిన సదస్సు, ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని వైమానిక విశ్వ కేంద్రంగా రూపొందించే లక్ష్యంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రతి రెండేళ్లకోసారి అంతర్జాతీయ ప్రదర్శన, సదస్సు నిర్వహిస్తోంది. ఇందుకు హైదరాబాదే వేదికగా మారింది. అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు 25దేశాల మంత్రులు, రాయబారులు, ఉన్నతాధికారులతో పాటు వైమానిక రంగంలో పేరొందిన 12 దేశాలకు చెందిన 200 కంపెనీల వాణిజ్య ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







