కాబూల్‌లో భారత వ్యాపారి కిడ్నాప్...ఇది వారిపనేనా?
- September 15, 2021ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆ దేశంలో అరాచకాలు మొదలయ్యాయి. నడిరోడ్డుపైనే బెదిరించి కిడ్నాపులు చేయడం మొదలుపెట్టారు. రాజధాని కాబూల్‌లో భారత వ్యాపారి బన్సరీలాల్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. 50ఏళ్ల బన్సరీలాల్ కాబూల్‌లో ఫార్మా వ్యాపారం చేస్తున్నారు. ఉదయం కారులో ఇంటి నుంచి బయలుదేరగా మార్గమధ్యంలో ఓ కారులో వచ్చిన దుండగులు బన్సరీలాల్ కారును ఢీకొట్టారు. అనంతరం వ్యాపారిని, ఆయన సిబ్బందిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. అయితే, సిబ్బంది తప్పించుకొని బయటపడగా, భారత వ్యాపారి మాత్రం కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు. ఈ కిడ్నాప్ వ్యావహారంపై భారత విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసినట్టు ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ చందోక్ పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ వెనుక తాలిబన్లు ఉన్నారా తేదంటే ఎంకెవరైనా ఉన్నారా అనే విషయం తెలియాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి