రియాద్ వ్య‌క్తిగ‌త వివ‌రాల గోప్య‌త‌కు కొత్త చ‌ట్టం

- September 15, 2021 , by Maagulf
రియాద్ వ్య‌క్తిగ‌త వివ‌రాల గోప్య‌త‌కు కొత్త చ‌ట్టం

రియాద్: వ్య‌క్తుల అనుమ‌తి లేకుండా వారి వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను సేక‌రించే చ‌ర్య‌ల‌ను ఉపేక్షించ‌బోమ‌ని సౌదీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు వ్య‌క్తిగ‌త డేటా ర‌క్ష‌ణ చ‌ట్టానికి మంత్రి మండ‌లి ఆమోదం తెలిపింది. ఇత‌ర వ్య‌క్తుల  అనుమ‌తి లేకుండా వారి వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను సేక‌రించటాన్ని ఈ చ‌ట్టం నిలువ‌రిస్తుంది. వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం వాటిల్ల‌కుండా భ‌ద్ర‌త ఇచ్చే ఈ ప‌ర్స‌న‌ల్ డేటా ప్రొటెక్ష‌న్ లా మ‌రో ఆరు నెల‌ల్లో అమ‌లులోకి వ‌స్తుంద‌ని సౌదీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) ప్రకటించింది. డేటాలో పేరు, గుర్తింపు సంఖ్య, చిరునామా, ఫోన్ నంబర్, వ్యక్తిగత రికార్డులు, ఆర్థిక రికార్డులు, చిత్రాలు, వీడియోలు లేదా ఏదైనా ఇతర గుర్తింపు వివ‌రాల‌కు ఈ చ‌ట్టం ద్వారా భ‌ద్ర‌త దొరుకుతుంది. అయితే..డేటా యజమానికి తన వ్యక్తిగత వివ‌రాల‌ను ప్రత్యేక ప‌రిస్థితుల్లో పరిమిత కాలం పాటు ప్రాసెస్ చేసేలా అభ్య‌ర్ధనతో కూడిన అనుమ‌తితో డేటా పొంద‌వ‌చ్చు. ఇది ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు అర్హుల‌ను గుర్తించ‌టం వంటి ప‌రిస్థితుల్లో ఈ వెసులుబాటు ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com