ఫ్యామిలీ, టూరిస్ట్, కమర్షియల్ వీసాల జారీ షరూ..
- September 16, 2021
కువైట్: ఫ్యామిలీ, టూరిస్ట్, కమర్షియల్ వీసాల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించినట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖలోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగం స్పష్టం చేసింది. మంత్రి మండలి నిర్ణయం మేరకు వైద్య, విద్య రంగాల్లో నైపుణ్యత కలిగిన వ్యక్తుల రక్త సంబంధీకులకు ఆర్టికల్ 22 ప్రకారం ఫ్యామిలీ వీసాలను మంజూరు చేస్తున్నట్లు వివరించింది. అలాగే టూరిస్టులు, వివిధ వ్యాపార పనుల నిమిత్తం వచ్చే వారికి ఆర్టికల్ 14 ప్రకారం కమర్షియల్ వీసాలు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు..గత రెండు రోజులుగా ఎంట్రీ వీసాలతో కొద్దిమంది పర్యాటకులు వచ్చినట్లు భద్రతా వర్గాలు కూడా చెబుతున్నాయి. దీంతో వీసాల జారీ ప్రక్రియ ఇప్పటికే జారీ అయినట్లు అర్ధం అవుతోంది. ఇదిలాఉంటే..దరఖాస్తుదారుడి ఐడీ కార్డు మీద ఉండే అడ్రస్ ఆధారంగా విజిటర్లు వీసాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







