ఫ్యామిలీ, టూరిస్ట్, కమర్షియల్ వీసాల జారీ షరూ..
- September 16, 2021కువైట్: ఫ్యామిలీ, టూరిస్ట్, కమర్షియల్ వీసాల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించినట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖలోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగం స్పష్టం చేసింది. మంత్రి మండలి నిర్ణయం మేరకు వైద్య, విద్య రంగాల్లో నైపుణ్యత కలిగిన వ్యక్తుల రక్త సంబంధీకులకు ఆర్టికల్ 22 ప్రకారం ఫ్యామిలీ వీసాలను మంజూరు చేస్తున్నట్లు వివరించింది. అలాగే టూరిస్టులు, వివిధ వ్యాపార పనుల నిమిత్తం వచ్చే వారికి ఆర్టికల్ 14 ప్రకారం కమర్షియల్ వీసాలు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు..గత రెండు రోజులుగా ఎంట్రీ వీసాలతో కొద్దిమంది పర్యాటకులు వచ్చినట్లు భద్రతా వర్గాలు కూడా చెబుతున్నాయి. దీంతో వీసాల జారీ ప్రక్రియ ఇప్పటికే జారీ అయినట్లు అర్ధం అవుతోంది. ఇదిలాఉంటే..దరఖాస్తుదారుడి ఐడీ కార్డు మీద ఉండే అడ్రస్ ఆధారంగా విజిటర్లు వీసాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు