ఇరాక్ అంతర్జాతీయ సమావేశానికి హజరవనున్న ఖతార్
- September 16, 2021
బగ్ధాద్: దోచుకున్న సొమ్ము రికవరీ, రికవరీ అయిన నిధుల ద్వారా జమ అయిన నిధుల సద్వినియోగం అంశాలతో రెండు రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సమావేశానికి బగ్ధాద్ వేదికైంది. అయితే..సమావేశంలో తాము కూడా పాల్గొంటున్నట్లు ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశానికి ఖతార్ ప్రతినిధి బృందానికి న్యాయ మంత్రి మసూద్ బిన్ మొహమ్మద్ అల్ అమ్రి నేతృత్వం వహిస్తారు. లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ సహకారంతో, అరబ్ న్యాయ మంత్రుల సమక్షంలో ఇరాక్ ప్రభుత్వం ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. రెండు రోజుల సదస్సులో అవినీతిపై పోరాటం, దొంగిలించబడిన నిధులను తిరిగి పొందడం, అరబ్ పౌరుల సంక్షేమానికి ఈ నిధులను వినియోగించటం వంటి అంశాలను సమీక్షిస్తారు. అనంతరం సమావేశ తీర్మానాలకు అరబ్ దేశాల న్యాయశాఖ మంత్రులకు అందజేస్తారు.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







