ఎక్స్పో 2020 దుబాయ్: టిక్కెట్ కలిగి, వ్యాక్సిన్ పొందనివారికి ఉచిత పిసిఆర్ టెస్ట్
- September 16, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్ విషయంలో కోవిడ్ సేఫ్టీకి ప్రధాన్యతనిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఆరు నెలలపాటు ఈ ఈవెంట్ జరగనుంది. మిలియన్ల సంఖ్యలో విజిటర్స్, ఈ ఎక్స్‌పోలో పాల్గొనే అవకాశం వుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ పొందినవారు లేదా, వ్యాక్సిన్ పొందకపోతే పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ (75 గంటల ముందు తీసుకున్న నెగెటివ్ రిజల్ట్ టెస్ట్) తప్పనిసరిగా కలిగి వుండాలి.. 18 ఏళ్ళ వయసు పైబడినవారు ఎక్స్పో సందర్శించాలంటే. సిటీ వ్యాప్తంగా పెద్దయెత్తున టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు, ఆ వివరాల్ని ఎక్స్పో వెబ్సైట్లో పేర్కొంటున్నారు. సందర్శకుల వద్ద ఎక్స్పో టిక్కెట్ వుంటే, ఉచితంగా పిసిఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎక్స్పో మరియు ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్ స్టాఫ్‌కి వ్యాక్సినేషన్ తప్పనిసరి. వాలంటీర్లు, కాంట్రాక్టర్లు, సర్వీస్ ప్రొవైడర్లు కూడా వ్యాక్సినేషన్ పొందాల్సిందే. ఇండోర్ అలాగే ఔట్ డోర్ వెన్యూలలో ఫేస్ మాస్కులు తప్పనిసరి. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి వుంటుంది. శానిటైజేషన్ స్టేషన్లనూ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







