ఎక్స్‌పో 20‌20 దుబాయ్: టిక్కెట్ కలిగి, వ్యాక్సిన్ పొందనివారికి ఉచిత పిసిఆర్ టెస్ట్

- September 16, 2021 , by Maagulf
ఎక్స్‌పో 20‌20 దుబాయ్: టిక్కెట్ కలిగి, వ్యాక్సిన్ పొందనివారికి ఉచిత పిసిఆర్ టెస్ట్

దుబాయ్: ఎక్స్‌పో 2020 దుబాయ్ విషయంలో కోవిడ్ సేఫ్టీకి ప్రధాన్యతనిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఆరు నెలలపాటు ఈ ఈవెంట్ జరగనుంది. మిలియన్ల సంఖ్యలో విజిటర్స్, ఈ ఎక్స్‌పోలో పాల్గొనే అవకాశం వుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ పొందినవారు లేదా, వ్యాక్సిన్ పొందకపోతే పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ (75 గంటల ముందు తీసుకున్న నెగెటివ్ రిజల్ట్ టెస్ట్) తప్పనిసరిగా కలిగి వుండాలి.. 18 ఏళ్ళ వయసు పైబడినవారు ఎక్స్‌పో సందర్శించాలంటే. సిటీ వ్యాప్తంగా పెద్దయెత్తున టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు, ఆ వివరాల్ని ఎక్స్‌పో వెబ్‌సైట్‌లో పేర్కొంటున్నారు. సందర్శకుల వద్ద ఎక్స్‌పో టిక్కెట్ వుంటే, ఉచితంగా పిసిఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎక్స్‌పో మరియు ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్ స్టాఫ్‌కి వ్యాక్సినేషన్ తప్పనిసరి. వాలంటీర్లు, కాంట్రాక్టర్లు, సర్వీస్ ప్రొవైడర్లు కూడా వ్యాక్సినేషన్ పొందాల్సిందే. ఇండోర్ అలాగే ఔట్ డోర్ వెన్యూలలో ఫేస్ మాస్కులు తప్పనిసరి. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి వుంటుంది. శానిటైజేషన్ స్టేషన్లనూ ఏర్పాటు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com