పాప్ అప్ స్టాండ్ వద్ద 50 శాతం రాయితీతో ఎయిర్ టిక్కెట్లను ప్రకటించిన ఎతిహాద్ ఎయిర్ వేస్
- September 17, 2021
దుబాయ్: దుబాయ్ మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వద్ద పాప్ అప్ స్టాండ్‌లో ఎయిర్ టిక్కెట్స్ కొనుగోలు చేసేవారికి 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ వెల్లడించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు అమల్లో వుంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో వుంటుంది. వారాంతాల్లో మిడ్ నైట్ వరకు ఈ స్టాండ్ తెరచి వుంటుంది. ఎతిహాద్ ఎయిర్ వేస్ బ్రాండ మార్కెటింగ్ మరియు స్పాన్సర్ షిప్ వైస్ ప్రెసిడెంట్ అమీనా తాహెచ్ మాట్లాడుతూ, అబుధాబిలో తప్పనిసరి క్వారంటైన్ నిబంధన ఎత్తివేయడంతో, ప్రయాణీకుల్ని ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ బుకింగ్స్ మీద ప్రత్యేకంగా 25 శాతం డిస్కౌంట్ పొందవచ్చునని ఎతిహాద్ వెల్లడించింది. డిసెంబర్ 8వ తేదీ వరకు ప్రయాణించేందుకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఎకానమనీ, బిజినెస్ క్లాసులకు అలాగే ఫస్ట్ క్లాస్ ప్రయాణానికి ఈ డిస్కౌంట్ వర్తించనుంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









