క్వారంటైన్ నిబంధ‌న‌ల్లో స‌వ‌ర‌ణ‌లు

- September 17, 2021 , by Maagulf
క్వారంటైన్ నిబంధ‌న‌ల్లో స‌వ‌ర‌ణ‌లు

కువైట్: కోవిడ్ వైర‌స్ వ్యాప్తి తీవ్ర‌త‌లో త‌గ్గుద‌ల న‌మోద‌వుతుండ‌టంతో క్వారంటైన్ నిబంధ‌న‌ల‌ను స‌వ‌రిస్తూ కువైట్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇన్సిట్యూష‌న‌ల్ క్వారంటైన్ ను వారం రోజుల కంటే త‌క్కువ రోజుల‌కు కుదించేందుకు మొగ్గు చూపుతుంది. ఇన్సిట్యూష‌న‌ల్ క్వారంటైన్ త‌ర్వాత మిగిలిన రోజులు హోం క్వారంటైన్లో ఉండాల్సిందేన‌ని కూడా స్ప‌ష్టం చేసింది. ఇదిలాఉంటే..దేశంలో వ్యాక్సిన్ రేటు ఈ నెలాఖ‌రు నాటికి 100 శాతానికి చేరుతుంద‌ని...ఇంకా ఎవ‌రైనా వ్యాక్సిన్ వేసుకోకుంటే వ్యాక్సిన్ వెబ్ సైట్ల ద్వారా త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఇదిలాఉంటే..క్వారంటైన్ గ‌డువును త‌గ్గించ‌నున్న‌ట్లు తెలిపిన మంత్రిత్వ శాఖ‌..కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను మాత్రం కొన‌సాగించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. దేశంలోకి వ‌చ్చే వాళ్లంతా పీసీఆర్ నెగ‌టీవ్ రిపోర్ట్ స‌మ‌ర్పించాల్సిందేన‌ని వెల్ల‌డించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com