అనుమతి లేని పెర్ఫ్యూమ్ కంపెనీలో సోదాలు..52,000 మెటీరియల్ సీజ్
- September 18, 2021
సౌదీ: ప్రభుత్వం నుంచి సరైన అనుమతి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కాస్మోటిక్స్ తయారీ కేంద్రాలపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ తమ దాడులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా రఫా గవర్నరేట్‌లోని ఒక రెస్ట్ హౌస్‌లో సోదాలు నిర్వహించిన అధికారులు పెర్ఫ్యూమ్ తయారీకి వినియోగించే 52,000 మెటిరీయల్ ను సీజ్ చేశారు. సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగించడానికి అనుమతించని ఉత్పత్తులతో పాటుగా రసాయనాలు, సింథటిక్ ఆయిల్ ఉత్పత్తులు ఉన్నాయని అన్నారు. సీజ్ చేసిన వాటిలో సింథటిక్ ఆయిల్ 17,500 డబ్బాలు, ఖాళీ కంటైనర్లు, 30,000 స్టిక్కర్లు, 5,000 పెర్ఫ్యూమ్ బాటిళ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సౌదీ చట్టాల మేరకు తగిన అనుమతులు లేకుండా కాస్మోటిక్స్ ఉత్పత్తులను తయారు చేయటం, మార్కెటింగ్ చేయటం నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి ఐదు మిలియన్ రియాల్ల వరకు జరిమానా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. చట్ట ఉల్లంఘునుల వివరాలు తెలిసిన పౌరులు యూనిఫైడ్ నంబర్ 19999 కు కాల్ చేసి తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులు కోరారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







