సాధారణ జీవితానికి చేరువలో ఉన్నామన్న కువైట్ ప్రధాని
- September 18, 2021
కువైట్: కోవిడ్ గాయంతో చిన్నాభిన్నమైన ప్రజా జీవణ గమనం ఇప్పుడిప్పుడే చక్కబడుతోందని కువైట్ ప్రధాని అల్ ఖలీద్ అన్నారు. కోవిడ్ మునపటిలా మళ్లీ సాధారణ జీవితానికి చేరుకునేందుకు మరో అడుగు దూరంలోనే ఉన్నామని ఆయన అభిప్రాయపడ్డారు. అర్హులైన వారిలో ఇప్పటికే 79 శాతం మంది సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించామని, ఇందులో 71 శాతం మంది డబుల్ డోస్ తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టడంతో వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ తగ్గుతోందని, ప్రస్తుతం పౌరులు, ప్రవాసీయుల్లో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయని ఆయన వివరించారు. ఇదే తీరును ఇంకొన్నాళ్లు కొనసాగించగలిగితే..తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఎన్నో రోజులు పట్టదన్నారు.
ఇదిలాఉంటే.. ఫర్వానియా హాస్పిటల్ విస్తరణ ప్రాజెక్ట్ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన క్యాబినెట్...కోవిడ్ ను ఎదుర్కోవటంలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన వైట్ ఆర్మీ(వైద్య సిబ్బంది) సేవలను గుర్తు చేసుకుంది. కోవిడ్ పై పోరాటంలో ప్రజలకు సేవలు అందిస్తూ అమరులైన వైద్య సిబ్బంది త్యాగాలను ఎప్పటికి గుర్తుంచుకునేలా వారిపై చక్కటి డాక్యుమెంటరీని రూపొందించే బాధ్యతను సమాచార విభాగానికి కేబినెట్ అప్పంగించింది. అంతేకాదు..అమరుల త్యాగాలకు గౌరవ చిహ్నాంగా జాబర్ అల్-అహ్మద్ హాస్పిటల్‌లోని ప్రముఖ ప్రదేశాలలో ఒకదానికి వారి పేర్లను పెట్టాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







