సైమా అవార్డ్స్ 2021 వేడుక
- September 19, 2021
హైదరాబాద్: (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) సైమా-2021 అవార్డ్స్ లో సౌత్ సినిమా సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. అందాల ముద్దుగుమ్మలు స్టైలిష్ డ్రెస్‌లలో స్టేజీపై హొయలు పోయారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపైన అవార్డ్స్ స్వీకరించారు. ఇక టాలీవుడ్ తారలు అవార్డ్స్ తో సందడి సందడి చేశారు. కరోనా కారణంగా గత ఏడాది సైమా అవార్డ్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

2019వ సంవత్సరానికిగానూ టాలీవుడ్‌కు సంబంధించి విజేతల వివరాలు..
ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (మహర్షి)
ఉత్తమ నటుడు: మహేష్ బాబు (మహర్షి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నాని (జెర్సీ)
ఉత్తమ నటి: సమంత (ఓ బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): రష్మిక మందన్న (డియర్ కామ్రేడ్)
ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్ (మహర్షి)
ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ (ఓ బేబీ)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి)
ఉత్తమ గేయ రచయిత: శ్రీమణి(ఇదే కదా.. మహర్షి)
ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్షి(ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)
ఉత్తమ గాయని: చిన్మయి (మజిలీ-ప్రియతమా)
ఉత్తమ విలన్: కార్తికేయ గుమ్మకొండ (నానిస్ గ్యాంగ్ లీడర్)
ఉత్తమ తొలి పరిచయ హీరో: శ్రీ సింహా (మత్తు వదలరా)
ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్ (దొరసాని)
ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: స్వరూప్ ఆర్ఎస్జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)
ఉత్త తొలి పరిచయ నిర్మాత: స్టూడియో 99 (మల్లేశం)


తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







