పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ..!
- September 19, 2021
చండీగఢ్: పంజాబ్ కొత్త సీఎం ఎంపిక ఆద్యంతం ఉత్కంఠ రేపింది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీపేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఎస్సీ నేతకు ఈసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు చరణ్ జిత్ చన్నీ పేరును ట్విట్వర్ ద్వారా ఏఐసీసీ పరిశీలకులు హరీష్ రావత్ వెల్లడించారు. సుఖ్ జిందర్ సింగ్ రంధావా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం బలంగా హోరెత్తినా, ఆ కాసేపటే కాంగ్రెస్ ట్విస్ట్ ఇచ్చింది. అనూహ్యంగా చరణ్ జిత్ సింగ్ తెరపైకి వచ్చారు. నిన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో ఖాళీ అయిన పంజాబ్ సీఎం కుర్చీని భర్తీ చేయడానికి ఎఐసీసీ భారీ కసరత్తే చేసింది.పంజాబ్ కొత్త సీఎం పీఠం కోసం తొలుత మాజీ పిసీసీ అధ్యక్షులు సునీల్ జాఖడ్, ప్రతాప్ సింగ్ బజ్వా, మాజీ సీఎం రాజేందర్ కౌర్ భట్టల్, సుఖ్జిందర్ సింగ్ రంధావా పేర్లు వినిపించినప్పటికీ.. అదృష్టం చరణ్ జిత్ సింగ్ చన్నీనే వరించింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీలో ఆయన ఎన్నిక ఇక లాంఛనప్రాయమే.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







