'దృశ్యం 2' సెన్సార్ పూర్తి

- September 20, 2021 , by Maagulf
\'దృశ్యం 2\' సెన్సార్ పూర్తి

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దృశ్యం 2’. దాదాపు 8 యేళ్ల క్రితం విడుదలైన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్‌గా  ఈ సినిమా తెరకెక్కింది. ఇక వెంకటేష్ కూడా మోహన్‌లాల్ నటించిన అప్పటి సూపర్ హిట్ ‘దృశ్యం’ చిత్రాన్ని అదే టైటిల్‌తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా మీనా హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన ‘దృశ్యం 2’ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఎపుడో ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ తాజాగా ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా థియేట్రికల్ వేదికగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు U/A జారీ సర్టిఫికేట్ చేసారు. దృశ్యం2ను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ+హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com