300 దిర్హాముల ప్రత్యేక ఛార్జీలతో ఇండియాకి ఎయిర్ అరేబియా విమానాలు
- September 20, 2021
యూఏఈ: షార్జా కేంద్రంగా పనిచేస్తోన్న ఎయిర్ అరేబియా ఎయిర్ లైన్ సంస్థ, ఇండియాకి వెళ్ళే ప్రయాణీకుల కోసం స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. 300 దిర్హాముల నుంచి 600 దిర్హాముల మధ్య వన్ వే టిక్కెట్ ధరల వుండేలా 11 భారతీయ నగరాలకు కొత్త స్కీమ్ ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, హైద్రాబాద్ మరియు కోచిలకు 300 దిర్హాములతో వెళ్ళవచ్చు. కాలికట్ మరియు చెన్నై నగరాలకు 310 దిర్హాములతో వెళ్ళవచ్చు. త్రివేండ్రమ్ 320 దిర్హాములతో, అహ్మదాబాద్ 350 దిర్హాములతో, కోయంబత్తూర్ 398 దిర్హాములతో, బెంగళూరు 450 దిర్హాములతో, గోవా 600 దిర్హాములతో వెళ్ళేందుకు వీలు కల్పిస్తున్నారు. కాగా, యూఏఈ వచ్చే ప్రయాణీకులు (ఇండియా, పాకిస్తాన్, నేపాల్ మరియు శ్రీలంక నుంచి ఇ వీసా ద్వారా వచ్చేవారు) కోవిడ్ 19 వ్యాక్సినేషన్ రికార్డులను (షార్జా మరియు రాస్ అల్ ఖైమాలకు ప్రయాణిస్తే) చూపించాల్సి వుంటుంది. ప్రయాణానికి ముందు ఐసీఏ ద్వారా రిజిస్టర్ అవ్వాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









