వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతించండి..ఎయిర్ లైన్స్ కు సౌదీ ఆదేశాలు
- September 21, 2021
సౌదీ: కోవిడ్ నిబంధనలను సడలిస్తూ వస్తున్న సౌదీ ప్రభుత్వం..ఇతర దేశాల నుంచి వచ్చే వారితో ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటోంది. సౌదీ వచ్చే ప్రయాణికుల ఇమ్యూనిటీ స్థాయిని నిర్ధారించుకున్న తర్వాతే ఫ్లైట్లోకి అనుమతించాలని ఆదేశించింది. ఇమ్యూనిటీ స్థాయిలను నిర్ధారించుకోవటం అంటే వారు వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో తనిఖీ చేయటమే. ఇందుకు రెండు విధానాలను అనుసరించాలని కూడా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్..సౌదీకి విమానాలను నడిపే అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. తవక్కల్న యాప్ లో గ్రీన్ స్టేటస్ ఉన్నావారిని, లేదా ఖూదూమ్ ఆన్ లైన్ ఫ్లాట్ ద్వారా వ్యాక్సిన్ పొందినట్లు నిర్ధారించే సర్టిఫికెట్లను సమర్పించిన వారినే అనుమతించాలని..ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు







