చిన్న‌పిల్ల‌ల‌పై కోవిడ్ వ్యాక్సిన్‌ ట్ర‌య‌ల్స్ స‌క్సెస్‌..ఫైజ‌ర్ ప్ర‌క‌ట‌న‌

- September 21, 2021 , by Maagulf
చిన్న‌పిల్ల‌ల‌పై కోవిడ్ వ్యాక్సిన్‌ ట్ర‌య‌ల్స్ స‌క్సెస్‌..ఫైజ‌ర్ ప్ర‌క‌ట‌న‌

ఒమన్: కోవిడ్ మ‌హ‌మ్మారి నుంచి చిన్నారుల‌ను ఎలా ర‌క్షించుకోవాల‌నే క‌ల‌వ‌ర‌పాటుకు స‌మాధానం దొరికే దిశ‌గా వ్యాక్సిన్ ప్ర‌యోగాలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల‌లోపు చిన్నారుల‌పై తాము చేసిన క్లినిక‌ల్ ట్రయ‌ల్ ఫ‌లితాలు సానుకూలంగా ఉన్నాయ‌ని ఫైజ‌ర్ కంపెనీ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం 12 ఏళ్లకుపైబ‌డిన పిల్ల‌ల‌కు మాత్ర‌మే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఫైజ‌ర్ కంపెనీ ప్ర‌క‌టించిన‌ట్లు ట్ర‌య‌ల్స్ స‌క్సెస్ అవ‌టంతో త్వ‌ర‌లోనే 12 ఏళ్ల‌లోపు చిన్నారుల‌కు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com