ఐపీఎల్ పై కీలక నిర్ణయం తీసుకున్న ఆఫ్ఘన్ ప్రభుత్వం
- September 21, 2021
కాబూల్: గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. అక్కడి ప్రభుత్వం కూడా వారికి అధికారాన్ని అప్పగించేసింది. దాంతో అక్కడ తాలిబన్ల రాక్షస పాలన మొదలైంది. అయితే తాజాగా ఆఫ్ఘన్ లో తాలిబన్ ప్రభుత్వం ఐపీఎల్ కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మొదట వాయిదా పడిన ఐపిఎల్ 2021 ఫేజ్-2 సెప్టెంబర్ 19 నుండి యూఏఈలో ప్రారంభమైంది. కానీ తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో ఐపీఎల్ 2021 ప్రత్యక్ష ప్రసారని బ్యాన్ చేసారు తాలిబన్లు. ప్రేక్షకులలో మహిళలు ఉండటం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ కు సంబంధించిన ఎటువంటి ప్రత్యక్ష ప్రసారం ఉండకూడదని ఆఫ్ఘన్ మీడియాకు ఆదేశాలు జారీ చేసారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అక్కడ చీర్ గర్ల్స్ డ్యాన్స్ చేయడం మరియు మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానుల్లో మహిళలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇక ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబన్ల పాలనలో ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







