ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు
- September 23, 2021
నిరుద్యోగులకు శుభవార్త. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 313 పోస్టుల్ని ప్రకటించింది. గేట్ 2020 స్కోర్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ ఖాళీలను 2020 మార్చిలో ప్రకటించింది ఓఎన్‌జీసీ. కానీ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. కాబట్టి గేట్ 2020 స్కోర్ ఉన్నవారికి అవకాశం కల్పిస్తూ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. గేట్ 2021 స్కోర్ ఉన్నవారికి వేరుగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని ఓఎన్‌జీసీ ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
ONGC Recruitment 2021: ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు 313 విద్యార్హతలు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (సిమెంటింగ్) మెకానికల్ 6 గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (సిమెంటింగ్) పెట్రోలియం 1 గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ సివిల్ 18 గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ డ్రిల్లింగ్ 28 గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 39 గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ 5 గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఈ అండ్ టీ, టెలికామ్ ఇంజనీరింగ్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫిజిక్స్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ 32 గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ మెకానికల్ 31 గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (ప్రొడక్షన్) మెకానికల్ 21 గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (ప్రొడక్షన్) కెమికల్ 16 గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (ప్రొడక్షన్) పెట్రోలియం 12 గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (రిజర్వాయర్) 7 సంబంధిత స్ట్రీమ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్
కెమిస్ట్ 15 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ
జియాలజిస్ట్ 19 జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్
జియోఫిజిస్ట్ (సర్‌ఫేస్) 24 సంబంధిత స్ట్రీమ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్
జియోఫిజిస్ట్ (వెల్స్) 12 సంబంధిత స్ట్రీమ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్
మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ 12 ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ
ప్రోగ్రామింగ్ ఆఫీసర్ 5 ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ లేదా సంబంధిత స్ట్రీమ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్
ట్రాన్స్‌ఫోర్ట్ ఆఫీసర్ 7 మెకానికల్ లేదా ఆటో ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఇండస్ట్రియల్ 3 ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్
ONGC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 22
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 12
దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300.
వయస్సు- 33 ఏళ్ల లోపు.
వేతనం- రూ.60,000 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,80,000 వేతనం లభిస్తుంది.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ONGC Recruitment 2021: అప్లై చేయండి ఇలా...
Step 1- ఓఎన్‌జీసీ అధికారిక వెబ్‌సైట్ https://www.ongcindia.com/ లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.
Step 2- Recruitment of GTs in Engineering & Geoscience disciplines through GATE 2020 score నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
Step 3- Click here Online application process for recruitment of GTs పైన క్లిక్ చేయాలి.
Step 4- ఆ తర్వాత New applicants పైన క్లిక్ చేయాలి.
Step 5- గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్, మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 6- రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ కావాలి.
Step 7- ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
Step 8- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
Step 9- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









