మహిళను వేధించిన కేసులో వలసదారుడి అరెస్ట్

- September 26, 2021 , by Maagulf
మహిళను వేధించిన కేసులో వలసదారుడి అరెస్ట్

జెడ్డా: మక్కా పోలీస్, ఓ ఈజిప్టు జాతీయుడ్ని అరెస్టు చేశారు. ఓ మహిళను నిందితుడు వేధించినట్లుగా పోలీసులు వెల్లడించారు. మక్కా రీజియన్ పోలీస్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, నిందితుడు తాను చేసిన దుశ్చర్యను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడని తెలిపారు. ఆ వీడియో ఆధారంగా అతన్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ తరహా కేసుల్లో దోషులకు 100,000 సౌదీ రియాల్స్ వరకు జరీమానా పడే అవకాశం వుంది. రెండేళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడొచ్చు. పిల్లలపై లైంగిక వేధింపులు జరిగితే, అలాంటి కేసుల్లో అత్యధికంగా ఐదేళ్ళ జైలు శిక్ష, అత్యధికంగా 300,000 సౌదీ రియాల్స్ వరకు జరీమానా విధించే అవకాశం వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com