2016 హజ్ యాత్రకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 20వ తేదీ వరకు కంప్యూటర్ డ్రా ...
- March 17, 2016
2016 హజ్ యాత్రకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 20వ తేదీ వరకు కంప్యూటర్ డ్రా పద్ధతిలో ఎంపిక చేసేందుకు కేంద్ర హజ్ కమిటీ ప్రణాళికలు పూర్తి చేసింది. ఒకే రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ర్ర్టాలకు డ్రా తీసేందుకు ఏర్పాటు చేశారు. ఉదయం తెలంగాణ, మధ్యాహ్నం ఆంధ్ర ప్రాంతం హజ్ యాత్రికుల ఎంపిక జరుతుందని హజ్ కమిటీ అధికారులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు 20వ తేదీ ఆదివారం కేంద్ర హజ్ కమిటీ అధికారులు డ్రా తీస్తారని చెప్పారు. కానీ ఇంకా అధికారికంగా డ్రా తేదీ ప్రకటించలేదని, ఒకటి, రెండు రోజలు పెరిగే అవకాశం కూడా ఉండవచ్చని రాష్ట్ర హజ్ కమిటీ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల నుంచి 17,394 దరఖాస్తులు అందాయని, అందులో నగరం నుంచి 11,487 దరఖాస్తులు అందాయని ప్రత్యేక అధికారి తెలిపారు.ఈ ఏడాది 2011 రాష్ట్ర ముస్లిం జనాభా ఆధారం గా రాష్ర్టానికి హజ్ కోటా కేటాయిస్తారన్నారు. ఉపముఖ్యమం త్రి మహమూద్ అలీ, నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రి దత్త్తాత్రేయకు రాష్ట్ర హజ్ కోటా పెంపుకో సం విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







