దుబాయ్ లో ఛారిటీ క్రికెట్ మ్యాచ్
- September 26, 2021
దుబాయ్: వ్యక్థుల ఆర్థిక స్థితిగతులు, సామర్థ్యాలతో సంబంధం లేకుండా అందరికీ విద్య అందాలనే సంకల్పంతో జైన్ సేవా మిషన్, ఎకోప్ ఛారిటీ సంయుక్తంగా ఓ సేవా కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రత్యేకావసరాలుగల పిల్లలు, యంగ్ అడల్ట్స్ విద్య కోసం ఈ ఛారిటీ కార్యక్రమాలు పని చేయనున్నాయి. 5000 మంది సభ్యులుగల జైన్ సేవా సమితితో ఎకోప్ చేతులు కలిపింది. ఎకోప్, విమెన్ మరియు బాలికల ఉన్నతికి, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఈ రెండు సంస్థలూ కలిసి ఛారిటీ కార్యక్రమంలో భాగంగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నాయి. ఐదుగురు స్పాన్సర్స్, 60 మంది ఆటగాళ్ళు, ఆరు టీములతో ఈ పోటీలు జరుగుతాయి. గుజరాత్‌లోని శ్రీ రాజ్ సౌభాగ్ ఆషీర్వాద్ ట్రస్ట్ ఫర్ డిజేబుల్డ్, రాష్ట్రీయ ప్రగ్యా ద్రిష్టి సంస్థాన్ - ఢిల్లీ, పెహ్చాన్ - ది సీక్రెట్ స్కూల్ ఢిల్లీ - ఎన్సీఆర్, తదితర సంస్థలకు చేయూతనిచ్చేందుకు జైన్ సేవా మిషన్ - ఎకోప్ ఛారిటీ కలిసి పనిచేస్తున్నాయి. echopecharity@gmail ద్వారా ఈ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు.




తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







