కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లియరెన్స్ ఇప్పట్లో కష్టమే..!
- September 28, 2021
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత్ బయోటెక్ సంస్థ కోవిగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది. భారత్‌లో ఈ టీకాను విస్తృతంగా వినియోగిస్తుండగా.. ఇతర దేశాలకు కూడా ఈ టీకాను ఎగుమతి చేశారు.. కానీ, కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి ఇప్పట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లియరెన్స్ వచ్చేలా కనిపించడంలేదు.. ఎందుకంటే.. కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సంస్థకు తాజాగా కొన్ని ప్రశ్నలు వేసింది డబ్ల్యూహెచ్‌వో.. వ్యాక్సిన్‌కు సంబంధించి సాంకేతికరపరమైన అంశాలపై భారత్ బయోటెక్ నుంచి మరికొన్ని సమాధానాల కోసం ప్రయత్నిస్తోంది.. మరోవైపు.. డబ్బ్యూహెచ్‌వో ఆలస్యం చేస్తుంటే.. దాని ప్రభావం క్రమంగా భారతీయులపై పడుతోంది.. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే విద్యార్థులు మరికొంతకాలం వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది.. అత్యవసర వినియోగ అనుమతి దక్కకపోవడంతో అనేక దేశాలు కోవాగ్జిన్ టీకాను గుర్తించకపోవడంతో సమస్యగా మారుతోంది.
కాగా, తాము అభివృద్ధి చేసిన టీకాకు సంబంధించిన అన్ని రకాల డేటాను డబ్ల్యూహెచ్‌వోకు సమర్పించామని చెబుతోంది భారత్ బయోటెక్.. కానీ, కోవాగ్జిన్‌కు త్వరలోనే డబ్ల్యూహెచ్‌వో అనుమతి వస్తుందంటూ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన కొన్ని రోజుల్లోనే డబ్ల్యూహెచ్‌వో నుంచి ఇలాంటి సమాచారం వినాల్సి వచ్చింది. అయితే, ఆ డేటాను పరిశీలించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే విద్యార్థులు డబ్ల్యూహెచ్‌వో నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్







