స్నేహితుడ్ని కాపాడలేకపోయిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

- September 28, 2021 , by Maagulf
స్నేహితుడ్ని కాపాడలేకపోయిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

మనామా: స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోతున్న తమ స్నేహితుడ్ని కాపాడలేకపోయిన ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. రక్షించలేకపోవడానికి సరైన కారణం నిందితులు చెప్పలేకపోయారు. ముగ్గరు వ్యక్తులు తప్పతాగి స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్ళారు. అయితే, ఓ వ్యక్తి నీటిలో వుండగా, మిగిలిన ఇద్దరు వ్యక్తులు అతన్ని ఫోన్‌లో చిత్రీకరించారు. అయితే, మద్యం మత్తులో వున్న వ్యక్తి అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయినా, అతన్ని మిగతా ఇద్దరూ రక్షించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com