భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: సీపీ స్టీఫెన్ రవీంద్ర
- September 28, 2021
హైదరాబాద్: హిమాయత్ సాగర్ చెరువు, అప్ప చెరువు తదితర ప్రాంతాల పరిస్థితిని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆర్ డీ ఓ రాజేంద్ర నగర్ చంద్రకళ, జీహెచ్ఎమ్సీ, హెచ్ఎమ్ డబ్ల్యూఎస్, ఇరిగేషన్, రెవెన్యూ, ఎన్ హెచ్ఏఐ తదితర శాఖల అధికారులతో కలిసి ఈరోజు స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పా చెరువు, రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ బెంగుళూరు హైవే పై అప్ప చెరువు నీరు అంతా చేరుతుందన్నారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాలు దృష్యా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. అప్పా చెరువు వద్ద మరమ్మతు పనులను ఎన్ హెచ్ఏఐ, ఇరిగేషన్ శాఖలు సమన్వయం తో పూర్తి చేయాలన్నారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ డైవర్షన్ ను ఏర్పాటు చేశామన్నారు.
- గగన్‌పహాడ్ గ్రామం సమీపంలో శంషాబాద్ వైపు ఎన్ హెచ్ - 44 పై అప్ప చెరువు ప్రవహిస్తోంది. విమానాశ్రయం, కర్నూలు, బెంగళూరు మొదలైన ప్రాంతాలకు వెళ్లే పౌరులు ఎన్ హెచ్ - 44 కి బదులుగా ఓఆర్ఆర్ ను ఉపయోగించాలని సూచించారు.
- ORR సర్వీస్ రోడ్డులో టీఎస్ పీఏ నుండి శంషాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ టీఎస్పీఏ - ఖలీజ్‌ఖాన్ దర్గా- కిస్మత్పూర్ - బుద్వేల్ ఎక్స్టెన్షన్ - పిల్లర్ నెంబర్ 194 - ఆరాంఘర్ వద్ద మళ్లింపు తీసుకోవచ్చు.
- లోతట్టు ప్రాంత ప్రజలను వీలైనంత త్వరగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ మైక్ ల ద్వారా పోలీసులు అనౌన్స్ మెంట్ చేస్తున్నారన్నారు.
- అధికారులంతా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు.
- అత్యవసర పరిస్థితుల్లో 100 కి డయల్ చేయండి లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444.
- ప్రకృతి సృష్టించిన విలయంలో అధికారులు, ప్రజలంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలన్నారు.
సీపీ వెంట రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్, శంషాబాద్ ఏసీపీ భాస్కర్, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వ ప్రసాద్, రాజేంద్ర నగర్ జీహెచ్ఎమ్సీ డీసీ జగన్, హెచ్ఎమ్ డబ్ల్యూఎస్ జనరల్ మేనేజర్ రామకృష్ణ, హెచ్ఎమ్ డబ్ల్యూఎస్ డీజీఎమ్ రేణుక, రెవెన్యూ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా డీఈ వేంకటేశ్వర రెడ్డి, ఇరిగేషన్ ఈఈ విశ్వ, రాజేంద్ర నగర్ ఇన్ స్పెక్టర్ కనకయ్య, మైలార్ దేవ్ పల్లి ఇన్ స్పెక్టర్ నరసింహ, ఆర్ జీ ఐ ఏ ఇన్ స్పెక్టర్ విజయ్ కుమార్, రాజేంద్ర నగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, తదితర శాఖల అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







