గూగుల్‌ ప్లేలో అందుబాటులో దేశీయంగా తయారైన మైక్రో- లెర్నింగ్‌ వీడియో యాప్‌ - లైబ్రరీ

- September 28, 2021 , by Maagulf
గూగుల్‌ ప్లేలో అందుబాటులో  దేశీయంగా తయారైన మైక్రో- లెర్నింగ్‌ వీడియో యాప్‌ - లైబ్రరీ

హైదరాబాద్‌: షార్ట్‌ యూజర్‌ జనరేటెడ్‌ కంటెంట్‌తో మొబైల్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన - లైబ్రరీ, తన మొబైల్‌ యాప్‌ (అప్లికేషన్‌)ను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. దీని ద్వారా సులభంగా, ఆకర్షణీయంగా మరియు ప్రోత్సాహకరమైన మార్గంలో విజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశాన్ని లైబ్రరీ వినియోగదారులకు అందిస్తుంది.

లైబ్రరీ - ప్రపంచంలోనే మొట్టమొదటి మైక్రో-లెర్నింగ్‌ వీడియో యాప్‌ ప్లాట్‌ఫారమ్‌.

యూజర్‌-క్యూరేటెడ్‌ కంటెంట్‌-ఆధారితమైన ఈ యాప్‌ సుమారు 30 కేటగిరీలకు చెందిన విషయాలను హోస్ట్‌ చేస్తుంది మరియు వినియోగదారులకు ఆయా అంశాలపై ఏదైనా సమాచారాన్ని కేవలం 180 సెకన్లలోనే యాక్సెస్‌ చేసే సౌలభ్యాన్ని అందిస్తుంది. సామాజిక అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం ద్వారా నేర్చుకోవడం ఎలా జరుగుతుందనే దానిలో మార్పు తీసుకురావాలని లైబ్రరీ లక్ష్యంగా పెట్టుకుంది. సమయానికి విలువనిస్తూ పెరుగుతున్న మొబైల్‌-అవగాహన కలిగిన నేటితరంకు అవగాహన కలిగిన అభ్యాస అవసరాలను తీర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

కె-12 (కిండర్‌గార్టెన్‌ నుండి 12 స్టాండర్డ్‌ వరకు) ఎడ్యుకేషన్‌, టెక్నాలజీ మరియు మార్కెటింగ్‌ స్ట్రాటజీ విభాగాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన త్రయం - రెంగరాజన్‌ ఎమ్‌, సృజన బొబ్బా మరియు పవన్‌ కుమార్‌లు ఈ యాప్‌ను స్థాపించారు.

లైబ్రరీ, సహ-వ్యవస్థాపకుడు & సిఇఒ, రెంగరాజన్‌ ఎమ్‌ మాట్లాడుతూ, ‘‘లైబ్రరీ యాప్‌ను ప్రారంభించిన తర్వాత, యువతరానికి చెందిన జనరేషన్‌ - జెడ్‌కు చెందిన వారిలో అభ్యాస అనుభవాన్ని పునర్నిర్వచించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ యాప్‌ అభ్యాసకుడి కేంద్రీకృతమైనది, సరళమైనది  మరియు నవతరానికి చెందిన వారి యొక్క అవసరాలపై దృష్టి సారించడమే మా విధానం, వారు సమయం పట్ల స్పృహ కలిగి ఉంటారు మరియు తక్షణ సంతృప్తిని ఇష్టపడతారు. కలుషితమైన కంటెంట్‌ను జల్లెడ పట్టి కేవలం నేర్చుకునే కంటెంట్‌పై మాత్రమే పూర్తిగా దృష్టి సారించడం వలన నేర్చుకోవడం ద్వారా ఉత్పాదక కోణాన్ని అందించే ఒక వేదికను మేము ఊహించాము.’’

ముఖ్యమైన కంటెంట్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా స్మార్ట్‌ మరియు టార్గెటెడ్‌ పద్ధతిలో వినియోగదారులకు / వీక్షకులకు చేరువయ్యే ఛానెల్‌ని అందించడం ద్వారా బ్రాండ్‌లు అధిక-నాణ్యత, బి2సి నిబద్దతను నడపడానికి ఈ యాప్‌ ఒక శక్తివంతమైన ఛానెల్‌ను కూడా తెరుస్తుంది.

ఆండ్రాయిడ్‌ యూజర్‌ల కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ప్రస్తుతం అందుబాటులో ఉంది.

అదే విధంగా ఆపిల్‌ వినియోగదారుల కోసం ఐఒఎస్‌ యాప్‌ స్టోర్‌ త్వరలో అందుబాటులోకి రానున్నది.

www.librari.app 

లైబ్రరీ గురించి :

లైబ్రరీ అనేది అంతరాయం లేని స్వీయ-అభివృద్ధి చేసిన ఎడ్యుకేషనల్‌ ఫ్లాట్‌ఫామ్‌. ఇప్పటికే ఉన్న అనేక సామాజిక విద్యా ప్రొఫైల్‌లు ప్రయాణంలో ఉపయోగించడానికి  క్లిష్టంగా ఉండడమో లేదా  సామాజికంగా ఉన్నప్పుడు మరియు అభ్యాస ప్రక్రియలో ఉన్నప్పుడు వినియోగదారుల దృష్టి మరల్చేలా ఉన్నాయి, లైబ్రరీ చిక్కులులేని సామాజిక అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం ద్వారా విలువైన కంటెంట్‌తో లెర్నింగ్‌ ఎలా జరుగుతుందనే మార్పును తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వినియోగదారులు, నిపుణులు, ప్రభావశీలురు మరియు బ్రాండ్‌లను తక్కువ బైట్‌`పరిమాణం కలిగిన వీడియో కంటెంట్‌లను సృష్టించడానికి మరియు అప్‌లోడ్‌ చేయడానికి ప్రోత్సహిస్తుంది. ప్రతి షార్ట్‌ ఇన్‌సైట్‌ ఒక పాప్‌ క్విజ్‌ను కలిగి ఉంటుంది, అది వినియోగదారులు తాము చూసిన వీడియో నుండి పరిజ్ఞానాన్ని మరియు అవగాహనను పరీక్షించుకోవడంగా ఉంటుంది. ప్రతి ఇన్‌సైట్‌ను పూర్తి చేయడం ద్వారా వినియోగదారులకు రివార్డ్‌లతో పాటు బజార్‌లో క్లెయిమ్‌ చేసుకోవడానికి వీలు కలుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com