ఎస్బీఐ కార్డ్.. పండుగ ఆఫర్లు..
- September 30, 2021
ఎస్బీఐ కార్డ్ మూడు రోజుల పండుగ ఆఫర్లను ప్రకటించింది. అక్టోబరులో అన్ని దేశీయ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారాలపై తమ క్రెడిట్‌కార్డు ద్వారా చేసే కొనుగోళ్లకు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను అందజేయనున్నట్లు తెలిపింది. 'ధమ్‌దార్ దస్' పేరిట దీనిని నిర్వహిస్తోంది. ఈ మూడు రోజుల మెగా షాపింగ్ పండుగ ఆఫర్ అక్టోబరు 3 నుంచి ప్రారంభమవుతుంది. వినియోగదారులు తమ కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చని ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈఓ రామ్మోహన్ రావు అమర పేర్కొన్నారు.
ఆన్లైన్ మర్చంట్ ఈఎమ్ఐ లావాదేవీలపైనా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలు, టీవీలు, భారీ గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఫర్నీచరు, వంటగది ఉపకరణాలు, ఫిట్నెస్ ఉత్పత్తుల కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ వర్తిస్తుందని తెలిపింది. భీమా, ప్రయాణాలు, వాలెట్, ఆభరణాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, యుటిలిటీ మర్చంట్లకు చేసే ఆన్లైన్ వ్యయాలపై ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..







