కూకట్ పల్లి పీఎస్ ను సందర్శించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

- October 05, 2021 , by Maagulf
కూకట్ పల్లి పీఎస్ ను సందర్శించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పరిధిలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ గారు పోలీసు స్టేషన్ పరిసరాలను సందర్శించి పోలీసుస్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణపై లోతుగా పరిశీలించారు. విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర ప్రతీ రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే విధమైన పోలీసు సేవలను అందించాలన్నారు. 

పోలీస్ స్టేషన్ లోని ప్రతి విభాగమును విభజించి  క్రమమైన పద్ధతిలో ఉంచుకోవాలన్నారు. 17వర్టీకల్స్((1)రిసెప్షన్‌ స్టాఫ్‌ 2) స్టేషన్‌ రైటర్‌ 3) క్రైమ్‌ రైటర్‌ 4)బ్లూకోట్స్‌ 5) పెట్రోల్‌ స్టాఫ్‌ 6) కోర్టు వర్కింగ్‌ స్టాఫ్‌ 7) వారెంట్‌ స్టాఫ్‌ 8) సమన్స్‌ స్టాఫ్‌ 9) టెక్‌ టీమ్‌ 10)ఇన్వెస్టిగేషన్‌ స్టాఫ్‌ 11) క్రైమ్‌ స్టాఫ్‌ 12) మెడికల్‌ సర్టిఫికెట్‌ స్టాఫ్‌ 13)స్టేషన్‌ ఇన్‌చార్జి 14) జనరల్‌ డ్యూటీ స్టాఫ్‌ 15)డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ 16) స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ 17) అడ్మిన్‌ ఎస్‌ఐ)) ను పోలీసు స్టేషన్ లలో అమలు పర్చడంపై సమీక్షించారు.5s మెథడ్ లోని (Sort, Set, Shine, Standardize, Sustain) అంశాలను గురించి  ఒక్కొక దానిని గురించి విపులంగా తెలియజేశారు. 

క్రైమ్ వర్టికల్ లో పని చేసే సిబ్బంది వారి పి‌ఎస్ పరిదధిలోని పాత నేరస్తులు, సస్పెక్ట్ లపై నిఘాను ఉంచాలన్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు సరైన సమాచారాన్ని, ఆధునికతను ఉపయోగించి నేరస్తులను గుర్తించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలనన్నారు.      
ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి సంబంధించి స్టేషన్ సిబ్బంది అనుసరిస్తున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌కి వచ్చే వారితో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా విధులుండాలని ఆదేశించారు. పోలీసులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలన్నారు. 
లా అండ్ ఆర్డర్, నేరాల నివారణ వ్యూహాలపై సీపీ సిబ్బందితో చర్చించారు.
అనంతరం సిబ్బంది బ్యారక్ పరిసరాలను చూశారు.స్టేషన్ లోని సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావలన్నారు.సీపీ వెంట మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, కూకట్ పల్లి ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, కూకట్ పల్లి ఇన్ స్పెక్టర్ నర్సింగ్ రావు, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com