ఎర్లీ ఎంక్వయిరీ యాప్: ప్రయాణీకులకు కొత్త రుసుము
- October 05, 2021
కువైట్: ఎర్లీ ఎంక్వయిరీ అప్లికేషన్ ప్రవేశపెట్టడం ద్వారా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్రయాణీకులకు కొత్త రుసుములు వర్తిస్తాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూపొందించిన మెకానిజం ద్వారా ఎయిర్ టిక్కెట్లలోనే ఈ కొత్త ఫీజు పొందుపరచబడి వుంటుంది. రెండు అదనపు రుసుముల మొత్తం సుమారుగా 3.5 నుంచ 4 డాలర్ల వరకు ప్రయాణీకుల నుంచి వసూలు చేయబడుతుంది. ఏడేళ్ళ కాలానికిగాను ఈ విధానానికి సంబంధించి కాంట్రాక్టు విషయమై పలు సంస్థలను ఆహ్వానించేందుకు సంబంధిత రెగ్యులేటరీ అథారిటీస్‌ని డిజిసిఎ విజ్ఞప్తి చేయడం జరిగింది. సర్వీసు ఫీజు (0.80 అమెరికా డాలర్ల సర్వీసు ఫీజు) ప్రతి ప్రయాణీకుడి నుంచి వసూలు చేస్తారు. 0.48 కంపెనీకి, 0.32 డిజిసిఎకి దక్కుతుంది. 1 దినార్ బోర్డర్ సర్వీసెస్ ఫీజులో కంపెనీకి 550 ఫిల్స్ అలాగే 45 ఫిల్స్ సివిల్ ఏవియేషన్‌కి (తొలి 8 మిలియన్ మంది ప్రయాణీకులకు - ఏడాదిలో) చెల్లింపబడతాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







