ట్రావెల్ ఆంక్షలను సడలించనున్న సౌదీ
- October 06, 2021
రియాద్: కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో ట్రావెల్ ఆంక్షలను తగ్గించాలని సౌదీ ప్రభుత్వం భావిస్తోంది. కరోనా వ్యాప్తి గతంతో పోల్చితే చాలా వరకు తగ్గిందని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించారు. దీంతో ట్రావెల్ ఆంక్షలను సులభం చేయాలని నిర్ణయించారు. సౌదీ లో వచ్చే వారు 14 రోజుల పాటు ముందే క్వారంటైన్ లో ఉండాలని ఇప్పటి వరకు ఉన్న నిబంధనను తొలగించనున్నారు. స్టూడెంట్స్, ప్రొఫెసర్లు, టీచర్లు, యూనివర్సిటీస్ స్టూడెంట్స్, టెక్నికల్ ట్రైనింగ్ స్టూడెంట్స్ వీళ్లంతా సౌదీకి వచ్చాక ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాలి. ఇక సౌదీలోనే రెండు డోస్ లు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి కూడా మినహాయింపు ఇస్తామని అధికారులు తెలిపారు. బహ్రయిన్ కు చెందిన 18 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి లేదన్న నిబంధనను కూడా ఎత్తివేయనున్నారు. ఇక సౌదీకి వచ్చే ప్రయాణికులంతా కచ్చితంగా హెల్త్ డిపార్ట్ మెంట్ సూచించిన అన్ని సూచనలు పాటించాలని ప్రభుత్వం కోరింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







