జీఎస్టీ పరిహారం కింద మరో ₹40వేల కోట్లు.. ఏపీ, తెలంగాణకు ఎంతెంత?
- October 07, 2021
న్యూ ఢిల్లీ: జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మరో రూ.40వేల కోట్లు విడుదల చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు విడుదల చేసిన మొత్తం 1.15 లక్షల కోట్లకు చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరిహారం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.823.17 కోట్లు, తెలంగాణకు రూ.1149.46 కోట్లు కేంద్రం విడుదల చేసింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఏర్పడే రూ.1.59 లక్షల కోట్ల లోటును రిజర్వుబ్యాంకు నుంచి తీసుకొనే రుణం ద్వారా చెల్లించడానికి మే 28న జరిగిన 43వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం అంగీకరించింది. 2020-21లో ఇదే విధానంలో కేంద్రం రాష్ట్రాలకు రూ.1.10 లక్షల కోట్లు అందించింది. 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు చెల్లిస్తోంది. సెస్ వసూళ్ల ఆధారంగా చెల్లించే రూ.లక్ష కోట్ల పరిహారం కూడా కలిపితే ఈ ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం రూ.2.59 లక్షల కోట్లు అందుతుందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. జులై 15న విడుదల చేసిన రూ.75వేల కోట్లతో కలిపి ఇప్పటి వరకు జీఎస్టీ పరిహారం కింద 1.15 కోట్లను బ్యాక్-టు-బ్యాక్ లోన్ రూపంలో రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







