ఫోర్బ్స్ లిస్ట్: భారత్ లో అత్యంత ధనిక మహిళలు వీరే

- October 07, 2021 , by Maagulf
ఫోర్బ్స్ లిస్ట్:  భారత్ లో అత్యంత ధనిక మహిళలు వీరే

భారత్‌లోని 100 మంది అపర కుబేరుల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేయగా.. అందులో ఆరుగురు మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఓపి జిందాల్‌ గ్రూప్‌ చైర్‌ పర్సన్‌ సావిత్రి జిందాల్‌ (71) అత్యంత సంపద కల్గిన జాబితాలో ముందు వరుసలో చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్‌జాబితాలో ఆమెకు ఏడవ ర్యాంక్‌ లభించింది. ఆమె సంపద విలువ సుమారు రూ. 13.46 లక్షల కోట్లు (18 బిలియన్‌). గత ఏడాదితో పోలిస్తే ఆమె ఆస్తులు విలువ ఈ ఏడాది ఏకంగా 13 బిలియన్‌ డాలర్లు (రూ. 9.72 లక్షల కోట్లు) పెరిగింది. ఇక రెండవ స్థానంలో హావెల్స్‌ ఇండియా చైర్మన్‌ వినోద్‌ రారు గుప్తా (76). ఆమె ర్యాంక్‌ 24. ఈ ఏడాది ఆమె సంపద డబుల్‌ అయింది. ప్రస్తుతం ఆమె సంపద 7.6 బిలియన్‌ డాలర్లు (రూ. 5.68 లక్షల కోట్లు). ఆమె తరువాతి స్థానంలో లీనా తివారీ (43). ముంబయికి చెందిన యుఎస్‌వి ప్రైవేటు లిమిటెడ్‌, ఫార్మాసూటికల్‌ అండ్‌ బయోటెక్నాలజీ చైర్‌పర్సన్‌ అయిన లీనా ర్యాంక్‌లో 43వ స్థానంలో ఉన్నారు. ఆమె సంపద భారత కరెన్సీలో రూ. 3.28 లక్షల కోట్లు (4.4 బిలియన్‌ డాలర్లు).
ఆన్‌లైన్‌ విద్యా వేదిక బైజుస్‌ సహా వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్‌ (35) ఓవరాల్‌గా 47వ స్థానంలో నిలిచారు. కరోనాతో స్కూల్‌ మూతపడటంతో అనేక మంది విద్యార్థులు ఇటువంటి ఆన్‌లైన్‌ విద్యా వేదికలను ఆశ్రయించారు. దీంతో బైజుస్‌ ఆస్తుల విలువ కూడా పెరిగింది. దివ్య సంపద విలువ గత ఏడాది రూ. 7,477 కోట్లు కాగా (1 బిలియన్‌) ఇప్పుడు ఆమె సంపద విలువ రూ. 3.02 లక్షల కోట్లు (4.05 బిలియన్‌ డాలర్లు). ఇక బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందర్‌షా (68) ... 53వ ర్యాంక్‌లో ఉన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆమె సంపద విలువ క్షీణించింది. గత ఏడాది అనగా 2020లో ఆమె సంపద రూ. 4.6 బిలియన్‌ డాలర్లు (రూ. 3.43 లక్షల కోట్లు) ఉండగా.. ఇప్పుడు 2.91 లక్షల కోట్లకు పడిపోయింది. ఇక వంద మంది అత్యంత ధనవంతుల్లో చివరి వ్యాపార వేత్త మల్లిక శ్రీనివాసన్‌. ఆమె 73వ ర్యాంక్‌లో ఉన్నారు. ట్రాక్టర్‌ అండ్‌ ఫామ్మ్స్‌ ఎక్విప్‌మెంట్‌ లిమిటెడ్‌ (టిఎఎఫ్‌ఇ) సంస్థకు చెందిన మల్లిక సంపద విలువ రూ. 2.16 లక్షల కోట్లు (2.89 బిలియన్‌ డాలర్లు)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com