అవినీతికి పాల్పడిన 271 మంది ఉద్యోగుల అరెస్ట్
- October 08, 2021
సౌదీ అరేబియా: అవినీతి ఉద్యోగులపై సౌదీ యాంటీ కరప్షన్ అథారిటీ (NAZAHA) కొరడా ఝుళిపించింది. అధికార దుర్వినియోగం, లంచం తీసుకుంటూ అక్రమ సంపాదన అర్జిస్తున్న 271 మందిని అరెస్ట్ చేసింది. ఒక్క నెలలో 271 మంది అవినీతి ఉద్యోగులను అరెస్ట్ చేయటం విశేషం. వీరిలో డిఫెన్స్, అంతర్గత వ్యవహారాలు, నేషనల్ గార్డ్, హెల్త్, న్యాయశాఖ, ఆర్థిక శాఖ, మున్సిపల్ అండ్ రూరల్, పర్యావరణ, విద్యా, సోషల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఉద్యోగులు ఉన్నారు. వీరిపై లంచం, అధికార దుర్వినియోగం కింద అభియోగాలు నమోదు చేశారు. మరో 693 మందిని అవినీతి కేసుల్లో విచారించినట్లు(NAZAHA) తెలిపింది. 10, 329 రైడ్స్ నిర్వహించినట్లు పేర్కొంది.అవినీతి ఉద్యోగులకు సంబంధించి లీగల్ ప్రొసిజర్ కంప్లీట్ చేసి కోర్టుకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







