లీగల్ స్టేటస్ సరిచేసుకునేందుకు గడువు పెంపు
- October 08, 2021
ఖతార్: వీసా నిబంధనలు ఉల్లంఘించి ఖతార్ లో నివాసం ఉంటున్న ప్రవాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారంతా తమ లీగల్ స్టేటస్ ను సరిచేసుకోవాలని కోరింది. ఇందుకు సంబంధించి గ్రేస్ పీరియడ్ ను పొడగించింది. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 31 తేదీ వరకు అవకాశం కల్పించింది. ఉద్యోగులు, వర్కర్స్, రెసిడెంట్స్ ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తూ ఖతార్ లో ఉంటున్నారో వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
సర్వీస్ సెంటర్లు ఏర్పాటు
ప్రవాసులు తమ లీగల్ స్టేటస్ ను సరిచేసుకునేందుకు అంతర్గత వ్యవహరాల శాఖ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. అదే విధంగా ప్రత్యేకంగా సర్వీస్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఉమ్ సలాల్, ఉమ్ సునాయిమ్ (ఇండస్ట్రీయల్ ఏరియా), మిసామియర్, అల్ వక్ర, అల్ రయ్యన్ లో సర్వీస్ సెంటర్లు ప్రత్యేకంగా ఓపెన్ చేశారు. లీగల్ స్టేటస్ సరిచేసుకునే అభ్యర్థులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ సంప్రదించవచ్చు. ఖతార్ లో చాలా దేశాల ప్రజలు ఉండటంతో వారికి అర్థమయ్యే విధంగా అరబ్, ఇంగ్లీష్, ఉర్దూ, మలయాళం, తమిళ్, బంగ్లా, నేపాల్ భాషల్లో ఈ సమాచారాన్ని ప్రభుత్వం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







