మళ్లీ అర్ధరాత్రి ఆగిపోయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలు !
- October 09, 2021సోషల్ మీడియా దిగ్గజాలైన ఇన్ స్టాగ్రామ్ మరియు ఫేస్ బుక్ సంస్థల సేవలు మరోసారి నిలిచిపోయాయి. సర్వీస్ డౌన్ కారణంగా వినియోగ దారులు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. ఇన్ స్టాగ్రామ్ మరియు ఫేస్ బుక్ ల సేవలు… రాత్రి 12 గంటల తర్వాత.. సూమారు ఓ గంట పాటు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కారణంగా ఇన్ స్టాగ్రామ్ మరియు ఫేస్ బుక్ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం అందుతోంది.
దీని కారణంగా మెస్సేజులు, మరియు పోస్టింగ్ ల సమస్యలను వినియోగదారులు ఎదుర్కొన్నారు. అయితే.. ఈ సమస్య ఓ గంట తర్వాత… పరిష్కారం అయింది. ఇక దీనిపై ఫేస్ బుక్ సంస్థ … తమ వినియోగదారులకు క్షమాపణలు కూడా చెప్పింది. ” కొంత మంది వ్యక్తులకు మా యాప్స్, వెబ్ సైట్ లను యాక్సెస్ చేయడం లో అనేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ సమస్య తలెత్తింది. వినియోగదారులుగా మీరు మమ్మల్ని క్షమించండి. ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాం” అంటూ ఫేస్ బుక్ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?