జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ లో సదరన్ టెర్మినల్ ప్రాజెెక్ట్ పనులు ప్రారంభం
- October 09, 2021
రియాద్: జెడ్డా ఇస్లామిక్ పోర్టులో సదరన్ కంటైనర్ టెర్మినల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు దక్కించుకున్న సౌదీ పోర్ట్స్ అథారిటీ (మవానీ), దుబాయ్ పోర్ట్స్ వరల్డ్ ప్రాజెక్ట్ కలిసి గురువారం పనులు మొదలుపెట్టాయి. మొత్తం నాలుగు ఫేజ్ లలో పనులు చేస్తారు. 2024 నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ రూపురేఖలు మారిపోతాయి. ఒకేసారి ఐదు నౌకలను ఇక్కడ నిలపవచ్చు. కంటైనర్ షిప్‌లలో 26,000 TEU ల లోడ్ కెపాసిటీ పెరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్య, లాజిస్టిక్స్ కు ఇది కేంద్రంగా మారుతుంది. 30 ఏళ్ల పాటు సౌదీ పోర్ట్స్ అథారిటీ, దుబాయ్ పోర్ట్స్ ఆధ్వర్యంలో సదరన్ టెర్మినల్ నడిచేలా ఒప్పందం చేసుకున్నారు. జెడ్డా పోర్ట్ పనితీరు ఏటేటా మెరుగవుతోంది. లాయిడ్స్ లిస్ట్ గతేడాది ర్యాంకింగ్స్ లో ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని ప్రపంచంలోనే 37 వ అతిపెద్ద నౌకాశ్రయంగా నిలిచింది.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







