మళ్లీ అర్ధరాత్రి ఆగిపోయిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలు !
- October 09, 2021
సోషల్ మీడియా దిగ్గజాలైన ఇన్ స్టాగ్రామ్ మరియు ఫేస్ బుక్ సంస్థల సేవలు మరోసారి నిలిచిపోయాయి. సర్వీస్ డౌన్ కారణంగా వినియోగ దారులు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. ఇన్ స్టాగ్రామ్ మరియు ఫేస్ బుక్ ల సేవలు… రాత్రి 12 గంటల తర్వాత.. సూమారు ఓ గంట పాటు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కారణంగా ఇన్ స్టాగ్రామ్ మరియు ఫేస్ బుక్ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం అందుతోంది.
దీని కారణంగా మెస్సేజులు, మరియు పోస్టింగ్ ల సమస్యలను వినియోగదారులు ఎదుర్కొన్నారు. అయితే.. ఈ సమస్య ఓ గంట తర్వాత… పరిష్కారం అయింది. ఇక దీనిపై ఫేస్ బుక్ సంస్థ … తమ వినియోగదారులకు క్షమాపణలు కూడా చెప్పింది. ” కొంత మంది వ్యక్తులకు మా యాప్స్, వెబ్ సైట్ లను యాక్సెస్ చేయడం లో అనేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ సమస్య తలెత్తింది. వినియోగదారులుగా మీరు మమ్మల్ని క్షమించండి. ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాం” అంటూ ఫేస్ బుక్ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







