అస్తమించిన 'ఆర్తి'

- June 06, 2015 , by Maagulf
అస్తమించిన 'ఆర్తి'

1984, మార్చి 5న జన్మించిన ఆర్తి అగర్వాల్ 2001లో తెరంగేట్రం చేశారు. ఆర్తి తొలిసినిమా పాగల్ పాన్. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ లో రంగ ప్రవేశం చేశారు. ఇదే ఏడాది తెలుగులో తొలిసారిగా వెంకటేష్ సరసన 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో నటించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో పాటు నటిగా ఆర్తికి మంచి గుర్తింపు వచ్చింది. ఆర్తికి వెంటవెంటనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది. దీంతో ఆమె అతనికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జునల సరసన నటించడంతో పాటు యువ హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, తరుణ్ లతో నటించారు. ఆర్తి దాదాపు 20 చిత్రాల్లో నటించారు. దాదాపు నాలుగేళ్ల పాటు అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగారు. యువ హీరో తరుణ్ తో ప్రేమ విఫలం కావడం, ఆత్మహత్యాయత్నం చేశాక అవకాశాలు తగ్గిపోయాయి. ఉజ్వల్ కుమార్ ను పెళ్లాడిన ఆర్తి ఆమెరికాలో నివాసం ఉంటున్నారు. ఆమె చివరి చిత్రం నీలవేణి. ఇటీవల చిత్ర రంగానికి పూర్తిగా దూరంగా ఉన్న ఆర్తి ఆనార్యోగంతో మరణించారని వార్తలు రావడం టాలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 31 ఏళ్ల పిన్న వయసులో ఆర్తి కన్నుమూయడం అందర్నీ విషాదంలో నింపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com