దుబాయ్ ప్రభుత్వం కొత్త హౌసింగ్ స్కీం
- October 10, 2021
దుబాయ్: దుబాయ్ ప్రభుత్వం కొత్త హౌసింగ్ స్కీం ను తీసుకొచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన వారందరికీ ఒకే చోట ఇళ్లు, స్థలాలను ఇవ్వనుంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎక్కడైతే ఉంటారో అదే ప్రాంతంలో అర్హులకు నివాస స్థలం కేటాయించనున్నారు. ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు అంతా ఒక దగ్గరే ఉండాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో దుబాయ్ ప్రజలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దుబాయ్ రాజకుమారుడు, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కొత్త పథకం ద్వారా గ్రాంట్లు, భూమి, హౌసింగ్ యూనిట్లను మార్పు చేసుకోవచ్చని ఆయన అన్నారు. " దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఒకే ఫ్యామిలీకి ఒకే ప్రాంతంలో నివాస స్థలాన్ని కేటాయించటానికి ప్రాధాన్యత ఇస్తాం. "అని షేక్ హమ్దాన్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







