ఒమాన్ లో 84 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి

- October 12, 2021 , by Maagulf
ఒమాన్ లో 84 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి

మస్కట్: ఒమాన్ లో 84 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి అయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ -19 వైరస్‌కు వ్యతిరేకంగా సుల్తానేట్‌లో టీకాలు వేసిన వ్యక్తుల సంఖ్యపై తాజా గణాంకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశంలో  మొత్తం 10,96,838 మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ల మొదటి డోస్ ను అందించినట్లు చెప్పారు. ఈ సంఖ్య 84 శాతం జనాభా కు సమానం. అలాగే రెండు డోస్ లు తీసుకున్న వారి సంఖ్య రెండు మిలియన్లు (65 శాతం). సుల్తానేట్లో ఇప్పటివరకు మొత్తం 52,54,000 వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com