ఖతార్ యూనివర్సిటీ (QU) మెట్రో స్టేషన్,గోల్ఫ్ ఇంటర్‌సెక్షన్ రోడ్డు ప్రారంభం
- October 12, 2021
ఖతార్: యూనివర్సిటీ (QU) మెట్రో స్టేషన్, అల్ టార్ఫా ఇంటర్‌సెక్షన్ (గోల్ఫ్ ఇంటర్‌సెక్షన్) ను అనుసంధానించే కొత్త రహదారిని పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రారంభించింది. ఈ మేరకు అష్ఘల్ ట్వీట్ చేసింది. " కొత్త రహదారితో రోడ్ రైలు నెట్‌వర్క్, నెట్‌వర్క్ మధ్య పరస్పర సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే QU క్యాంపస్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలు తొలుగుతాయి." ట్వీట్ లో అష్ఘల్ పేర్కొంది. ప్రారంభమైన రహదారిలో స్ట్రీట్ లైట్ల వ్యవస్థలు, రోడ్ మార్కింగ్, సిగ్నల్స్ లతో పాటు మురికినీరు, నీటిపారుదల లైన్‌లు ఏర్పాటు చేశారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి 151 చెట్లు, 7,000 చదరపు మీటర్ల పచ్చటి గార్డన్లు, 2.5 కి.మీ.ల ఫుట్ పాత్, సైకిల్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. 2022 సంవత్సరం నాటికి దాదాపు 2,650 కిమీ సైక్లింగ్, పాదచారుల మార్గాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి అష్ఘల్ కృషి చేస్తోంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







