తెలంగాణ డిమాండ్..కృష్ణా జలాల్లో 50 శాతం వాటా
- October 12, 2021
హైదరాబాద్: సోమాజిగూడలోని జలసౌధ కార్యాలయంలో మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం అయింది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించనున్నారు. ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంతో పాటు ఉప సంఘం నివేదికపై కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించనున్నారు.
ఈ సమావేశానికి హాజరయ్యే కంటే ముందు తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోరుతున్నాం. ప్రాజెక్టుల నిర్వహణ ఎలా చేస్తారని అడుగుతున్నాం? ఇవాళ్టి సమావేశం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. బోర్డు పరిధిలోకి ఏ ప్రాజెక్టులు ఇవ్వాలనేది చర్చిస్తామన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు వాటా పెరగాలి. నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలో అధికంగా ఉంది. నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించాలి. వాటా ప్రకారం తెలంగాణకు 570 టీఎంసీలు కేటాయించాలి. కొత్త ట్రిబ్యునల్ వచ్చే వరకు మరో 105 టీఎంసీలు ఇవ్వాలన్నారు. బోర్డు పరిధిలో విద్యుత్ ప్రాజెక్టులూ ఉండాలని కోరుతున్నారు. తెలంగాణలో అనేక ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఈ క్రమంలో నీటి వాటాతో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకాలు, బోరుబావులకు విద్యుత్ ఉత్పత్తి చేయాలి అని రజత్ కుమార్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







