మనీ లాండరింగ్‌ సమస్యకు చెక్ పెట్టనున్న యూఏఈ

- October 12, 2021 , by Maagulf
మనీ లాండరింగ్‌ సమస్యకు చెక్ పెట్టనున్న యూఏఈ

యూఏఈ: మనీ లాండరింగ్‌ను పరిష్కరించే క్రమంలో దేశంలో నిధుల సేకరణ మరియు స్వచ్ఛంద సంస్థల కు అందించే విరాళాలను నియంత్రించే దిశగా కొత్త చట్టాన్ని అభివృద్ధి చేస్తోంది యూఏఈ. అదే ‘నిధుల సేకరణ నియంత్రణ చట్టం’. 

ఈ చట్టం..దేశంలో నిధులను కోరే ప్రభుత్వేతర సంస్థలకు వర్తిస్తుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

మనీలాండరింగ్ మరియు టెర్రరిజం ఫైనాన్సింగ్‌పై పోరాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో ఇది ఒక భాగమని మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (MOCD) లో సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గా విధులు నిర్వహిస్తున్న నాసర్ ఇస్మాయిల్ చెప్పారు.

నిధుల సేకరణ మరియు స్వచ్ఛంద సంస్థ లకు ఇచ్చే విరాళాలపై ఇప్పటికే యూఏఈ లో కఠినమైన చర్యలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం, ఎవరైనా రిజిస్టర్డ్ స్వచ్ఛంద సంస్థల ద్వారా చట్టబద్ధంగా మానవతా కారణాల కోసం నిధులను అందించవచ్చు, అయితే నిధులను సేకరించాలనుకునే వారు జాతీయ స్థాయిలో ఇస్లామిక్ వ్యవహారాలు మరియు ఎండోమెంట్‌ల జనరల్ అథారిటీ నుండి అయినా, లేదా, దుబాయ్‌లో ధార్మిక కార్యకలాపాల విభాగం నుంచైనా ఆమోదం పొందిన తర్వాత మాత్రమే చేయాలి.

స్వచ్ఛంద సంస్థలు మనీలాండరింగ్ మరియు పన్ను ఎగవేత కోసం ఉపయోగించబడుతున్నాయని OECD ఒక నివేదికలో హెచ్చరించింది. కాబట్టి, మనీ లాండరింగ్‌పై పోరాడేందుకు యూఏఈ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com