మొక్కలు నాటిన ‘మహా సముద్రం’ మూవీ టీం
- October 12, 2021
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం లో బాగంగా తమ నూతన చిత్రం మహాసముద్రం విడుదలను పురస్కరించుకొని ఈరోజు జూబ్లీహిల్స్ లోని JRC కన్వెన్షన్ సెంటర్ లో మొక్కలు నాటిన మహాసముద్రం సినిమా హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీరావ్, డైరెక్టర్ అజయ్ భూపతి, విలక్షణ నటుడు రావు రమేష్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి ముందు తీసుకపోవడం జరుగుతుందని అన్నారు.మా నూతన చిత్రం మహాసముద్రం విడుదల సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశ్యంతో ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.భవిష్యత్‌లో మా అభిమానులు అందరూ కూడా మొక్కలు నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహాసముద్రం చిత్ర బృంద సభ్యులకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని అందజేయడం జరిగింది.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్‌లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్‌లో మంత్రి సత్యకుమార్‌తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









