కారులో కన్నాబిస్ ఆయిల్: బ్రిటిష్ ఫుట్‌బాల్ కోచ్‌కి పాతికేళ్ళ జైలు
- October 13, 2021
దుబాయ్: బ్రిటిష్ ఫుట్ బాల్ కోచ్‌కి చెందిన కారులో కన్నాబిస్ ఆయిల్ బాటిల్స్ కనుగొన్న అధికారులు, అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడికి 25 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడు బిల్లీ హూద్, ఆ లిక్విడ్ కన్నాబిస్ తనకు చెందినది కాదనీ, తన స్నేహితుడు కారులో వాటిని వదిలేశాడని నిరూపించడంలో విఫలమయ్యారు. బిల్లీ హూద్, యాంటీ డ్రగ్ మరియు నాన్ స్మోకింగ్ ఫిట్నెస్ ఫానటిక్ కావడం గమనార్హం. కాగా, హూద్ స్నేహితుడు వాట్సాప్ మెసేజ్ ద్వారా తాను కారులో కన్నాబిస్ ఆయిల్ మర్చిపోయిన విషయాన్ని పేర్కొన్నారు. అయితే, డ్రగ్స్ విషయమై ఇరువురి మధ్యా సంభాషణ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో హూద్ తీవ్రంగా కలత చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్వచ్ఛందంగా హూద్, యూరిన్ టెస్ట్ చేయించుకోగా.. అది నెగెటివ్ వచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







